ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి హరీష్ రావుకి విముక్తి

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఓ పక్క నత్త నడకన సాగుతుండగా, మరో పక్క దీనికి సంబందించిన మరో కేసులో మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, రాధాకిషన్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. 

ఎన్నికలలో సిద్ధిపేట నుంచి పోటీ చేసి హరీష్ రావు చేతిలో ఓడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్, వారిరువురు తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని పిర్యాదు చేయగా పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వారు ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడంతో హైకోర్టు ఈ కేసు కొట్టివేసి హరీష్ రావు, రాధా కిషన్ రావులకు విముక్తి కల్పించింది. 

పిటిషనర్ చక్రధర్ గౌడ్ రాజకీయ శతృత్వంతోనే ఈ కేసు పెట్టిన్నట్లు భావిస్తున్నామని జస్టిస్ కే. లక్ష్మణ్ అన్నారు. ఆయన ఈ కేసు వేసేందుకు ఇంత సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. నిందితులు హరీష్ రావు, రాధా కిషన్ రావు పిటిషనర్‌ ఫోన్ ట్యాపింగ్ చేసిన్నట్లు కానీ, బెదిరించిన్నట్లు గానీ పోలీసులు ఎటువంటి సాక్ష్యాధారాలు చూపకపోవడం వలన ఈ కేసు కొట్టివేస్తున్నామని జస్టిస్ కే. లక్ష్మణ్ తీర్పు చెప్పారు.