నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం సాగిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం, దానిపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన రెండూ కూడా చాలా రొటీన్‌గా ఉన్నాయి.
ఆనవాయితీ ప్రకారం గవర్నర్ తెలంగాణ ప్రభుత్వం తరపున, అదిచ్చిన ప్రసంగ పాఠాన్ని చదవాల్సి ఉంటుంది కనుక కాంగ్రెస్ పాలన అద్భుతంగా ఉందని చెప్పాల్సి వచ్చింది. ఆయన ప్రసంగం ఈవిదంగానే ఉంటుందనే విషయం తెలిసి ఉన్నప్పటికీ, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగాన్ని తప్పు పట్టారు. ఎప్పటిలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రేపు లేదా హోళీ సెలవు తర్వాత సోమవారం నుంచి ప్రారంభం అయ్యే శాసనసభ సమావేశాలు చాలా వాడీవేడిగా సాగబోతున్నాయి. అటువంటి సమావేశాలైనా సరే ఇలా రొటీన్‌గానే మొదలవక తప్పదు.
అయితే గవర్నర్ ప్రసంగిస్తుండగానే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలియజేస్తూ నినాదాలు చేసి సభలో ఆయన పట్ల అమర్యాదగా వ్యవహరించారని చెప్పక తప్పదు.
Live: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
— BRS Party (@BRSparty) March 12, 2025
https://t.co/bhaNldLuAz