హరీష్ రావుపై మరో కేసు నమోదు

మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఇప్పటికే చాలా కేసులున్నాయి. తాజాగా ఆయనపై బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. హరీష్ రావు, ఇటీవల జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన ఆయన ముగ్గురు వంశీకృష్ణ, పరశురాములు, సంతోష్ కుమార్‌ వలన తనకు ప్రాణభయం ఉందని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. హరీష్ రావు అనుచరులు తనను చంపేస్తామని ఫోన్లో బెదిరిస్తున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. 

ఆయన పిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు హరీష్ రావుతో సహా ఆయన అనుచరులపై సెక్షన్స్ 351(2), ఆర్‌డబ్ల్యూ 3(5) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ కృష్ణని ఏ-1గా, హరీష్ రావుని ఏ-2 గా పేర్కొన్నారు.