సంబంధిత వార్తలు
ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. వెంటనే పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మొత్తం ఏడు సంస్థలలో మాట్రిజ్ సంస్థ ఒక్కటే ఆమాద్మీ, బీజేపికి సరిసమానంగా సీట్లు రావచ్చని ప్రకటించగా మిగిలిన ఆరు సంస్థలు ఈసారి ఎన్నికలలో బీజేపి విజయం సాధించబోతోందని సూచించాయి. ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఏడు సర్వేలు తేల్చి చెప్పేశాయి.