కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్సభలో 2025-26 సంవత్సరాలకు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిలో మద్య తరగతి, ఎగువ మద్య తరగతి వేతన జీవులకు శుభవార్త వినిపించారు. రూ.75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్స్తో కలిపితే ఏడాదికి రూ.12,75,000 వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను ఉండబోదని ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో ఆదాయపన్ను స్లాబులు కూడా మార్చారు. దాని ప్రకారం..
రూ.4 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదు. ఆ పైన అంటే రూ.4-8 లక్షలకు 5%, రూ.812 లక్షలకు 10%, రూ.12-16 లక్షలకు 20%, రూ.20-24 లక్షలకు 25%, రూ.24 లక్షలు ఆ పైన ఆదాయం ఉన్నవారికి 30% పన్ను విధించబడుతుంది.
పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పులు చేయలేదు. దాని ప్రకారం రూ.2.5 లక్షల వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్ను ఉండదు. ఆపైన అంటే రూ.5 లక్షలకు 5%, రూ.5-10 లక్షలకు 20%, అంతకు మించి ఉంటే 30% పన్ను విధించబడుతుంది.