కాంగ్రెస్‌ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్ధి పేరు ఖరారు

తెలంగాణలో రెండు పట్టభద్ర, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ మూడు స్థానాలకు బీజేపి ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అభ్యర్ధిని ఖరారు చేసింది. 

కరీంనగర్-నిజామాబాద్‌-అదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి పేరుని ఖరారు చేసింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపి అభ్యర్ధిగా సి.అంజిరెడ్డి పోటీ చేయబోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ ఇంకా తన అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. 

ఎన్నికల షెడ్యూల్‌: నోటిఫికేషన్‌: ఫిబ్రవరి 3, పోలింగ్: ఫిబ్రవరి 27, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: మార్చి 3న.