టిజిఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్దం

టిజిఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు వారి జేఏసీ నేతలు సోమవారం హైదరాబాద్‌ బస్ భవన్‌లో ఆపరేషన్స్ ఈడీ ముని శేఖర్‌ని కలిసి సమ్మె నోటీస్ అందజేశారు. దానిలో మొత్తం 21 డిమాండ్లు పేర్కొని, ఫిబ్రవరి 9లోగా వాటని పరిష్కరించాలని లేకుంటే దశలవారీగా సమ్మె మొదలుపెడతామని తెలియజేశారు. 

ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు: 

1. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి టిజిఎస్ ఆర్టీసీకి అప్పగించాలి. సంస్థ ద్వారానే వాటిని నడిపించాలి. ఈ పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ తగదు.       

2. టిజిఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగులందరికీ ప్రభుత్వోద్యోగులతో జీతాభత్యాలు, సౌకర్యాలు కల్పించాలి. 

3. ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం స్వీకరించాలి. దీని కోసం బడ్జెట్‌లో 3 శాతం నిధులు కేటాయించాలి. 

4. పీఎఫ్, సీసీఎస్‌ బకాయిలు తక్షణమే చెల్లించాలి. ఆర్టీసీ ఉద్యోగులు చెల్లించిన పీఎఫ్ సొమ్ము సుమారు రూ.12,000 కోట్లు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయానికి జమా చేయాలి.

5. మహిళా కార్మికులు రాత్రి 8 గంటలలోపు ఇల్లు చేరుకునే విదంగా డ్యూటీలు వేయాలి.  

6. మహాలక్ష్మి పధకంతో ఉద్యోగులపై పని భారం పెరిగింది. బస్సులు సరిపోవడం లేదు. కనుక రోజుకు 8 గంటల డ్యూటీని అమలుచేయాలి. పెరిగిన రద్దీకి అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేసి, కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. 

7. మహాలక్ష్మి పధకంలో జీరో టికెట్ బదులు స్మార్ట్ కార్డ్ ప్రవేశపెట్టాలి.