ఎఫ్-1 కేసులో ముగిసిన ఈడీ విచారణ

ఎఫ్-1 రేసింగ్ కేసులో ఈరోజు ఉదయం 10.30 నుంచి ఏడు గంటలసేపు ఈడీ అధికారులు కేటీఆర్‌ని ప్రశ్నించారు. విచారణకు న్యాయవాదులు ఎవరినీ లోనికి అనుమతించలేదు.

విచారణ ముగిసిన తర్వాత కూడా కేటీఆర్‌ ఇంకా ఈడీ కార్యాలయంలోనే ఉండటంతో బయట ఆయన కోసం ఎదురుచూస్తున్న బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు లోపల ఏం జరుగుతోందో తెలియక చాలా ఆందోళనగా ఉన్నారు. మరికొద్ది సేపటిలో కేటీఆర్‌ బయటకు వస్తారని సమాచారం. 

ఏసీబీ నమోదు చేసిన కేసు, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఈడీ అధికారులు కేటీఆర్‌ని విదేశీ కంపెనీకి నిబందనలకు విరుద్దంగా నగదు బదిలీ చేయడం, దాని కోసం హెచ్ఎండీఏ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, రేసింగ్ ఈవెంట్ నిర్వహణలో ప్రభుత్వం, హెచ్ఎండీఏ, ప్రమోటర్స్, నిర్వాహకుల పాత్రల గురించి ఈడీ అధికారులు ప్రశ్నలు సందించిన్నట్లు సమాచారం.