ఈ సంక్రాంతి నుంచి రైతుభరోసా పధకం అమలుచేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు చెప్పినప్పటికీ ఈ పద్ధకాన్ని జనవరి 26 నుంచి అమలుచేయబోతున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలలో రెండు పంటలకు కలిపి రూ.14,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ రూ.12,000 ఇవ్వబోతున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఎకరాల పరిమితి పెట్టకుండా ఎంత భూమి సాగులో ఉంటే అంతకీ ఈ పధకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.
కౌలు రైతులకు కూడా సంవత్సరానికి రూ.12,000 చొప్పున చెల్లించబోతున్నామని తెలిపారు. ఈ పధకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అని పేరు ఖరారు చేసిన్నట్లు తెలిపారు. ఈ మూడు పధకాలు జనవరి 26 నుంచి ప్రారంభం అవుతాయని తెలియజేస్తూ సీఎంవో పూర్తివివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నూతన సంవత్సరంలో తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి @revanth_anumula గారు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎకరాకు 12 వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే వ్యవసాయ భూములు లేని రైతులకు సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున ఆర్థిక… pic.twitter.com/Vk0SeFhlTc
— Telangana CMO (@TelanganaCMO) January 4, 2025