రూట్ మార్చిన హైడ్రా.. ప్రజల నుంచే పిర్యాదులు

నిరుపేదలు, మద్య తరగతి ప్రజల ఇళ్ళు, దుకాణాలను కూల్చివేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హైడ్రా రూటు మార్చి ఇప్పుడు ప్రజల నుంచే పిర్యాదులు స్వీకరించి వాటి ఆధారంగా కూల్చివేతలకు సిద్దం అవుతోంది.

బుద్ధ భవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 నుంచి మద్యాహ్నం 2.00 గంటల వరకు హైడ్రా కమీషనర్ రంగనాధ్ స్వయంగా ప్రజల నుంచి పిర్యాదులు స్వీకరించనున్నారు.

ఇకపై ప్రతీ సోమవారం ఇదే సమయానికి పిర్యాదులు స్వీకరించి, వాటికి సంబందించి వ్యక్తులు లేదా సంస్థలకు 10 రోజుల లోపుగా నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. 

హైడ్రాకు ప్రభుత్వం చట్ట బద్దత కల్పించడమే కాక దాని పరిధి పెంచి, విస్తృత అధికారాలు కల్పించి, సుమారు 1100 మంది సిబ్బందిని కూడా మంజూరు చేసింది. సంక్రాంతి పండుగ తర్వాత హైడ్రా పోలీస్ స్టేషన్‌ కూడా ఏర్పాటుకాబోతోంది.

ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడెక్కడ అధికార ప్రతిపక్ష నాయకులు, ఇతరులు ప్రభుత్వం భూములు, చెరువులు, నాలాలు కబ్జాలు చేశారో ప్రజల నుంచే పిర్యాదులు స్వీకరించబోతున్నారు. కనుక ఈసారి మరింత భారీ స్థాయిలో కూల్చివేతలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.