ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీస్

ఫార్ములా 1 రేసింగ్ కేసులో ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ కేటీఆర్‌పై కేసు నమోదు చేసి అరెస్టుకి సిద్దం కాగా ఆయన హైకోర్టుని ఆశ్రయించి ఈ నెల 31వరకు  ముందస్తు బెయిల్‌ పొందారు. ఇప్పుడు ఇదే కేసులో ఈడీ కూడా రంగంలో దిగి ఆయనకు నోటీస్ జారీ చేసింది. జనవరి 7న హైదరాబాద్‌లో తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న మున్సిపల్ శాఖ కార్యదర్శిగా చేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ని జనవరి 2న, హెచ్ఎండీఏలో చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డిని జనవరి 3న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. 

ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారం జరిగినప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకుండానే బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.53 కోట్లు రేసింగ్ కంపెనీకి బదిలీ చేయించారని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమే అని ఏసీబీ వారిపై కేసు నామోదు చేసింది. ఆ వ్యవహారంలో నిబంధనలకు విరుద్దంగా ఆర్ధిక లావాదేవీలు జరిగినందున ఈడీ కూడా రంగంలో దిగి వారికి నోటీసులు జారీ చేసింది.