అగ్గిపెట్టె హరీష్ రావా మాకు చెప్పేది?

ఈరోజు శాసనసభలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల సభ్యులు తీవ్రస్థాయిలో పరస్పరం ఎదురుదాడులు చేసుకున్నారు. 

బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, “అధికార పార్టీకి చెందిన కొందరు శాసనసభ్యులు పొద్దునే మద్యం సేవించి శాసనసభకు వచ్చిన్నట్లు మాకు అనుమానం కలుగుతోంది. అందుకే వారు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. మద్యం తాగి రోడ్లపై వాహనాలు నడిపేవారిని గుర్తించడానికి పోలీసులు ‘డ్రంక్ & డ్రైవ్’ కార్యక్రమం చేపడుతున్నట్లే శాసనసభలో కూడా డ్రంకన్ ఎమ్మెల్యేలను గుర్తించడానికి పరీక్షలు చేపట్టాలని కోరుతున్నాను,” అని అన్నారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  ఘాటుగా స్పందిస్తూ, “మీ అధినేత కేసీఆరే  మందు కొట్టి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారు. అందుకే శాసనసభ సమావేశాలకు రావడం లేదు. ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మద్యం మత్తులో కింద పడిపోయిన సంగతి అందరికీ తెలుసు. మీకు మందు అలవాటు ఉంటే అందరికీ అదే అలవాటు ఉంటుందని అనుకుంటున్నారా? ఈ అగ్గిపెట్టె హరీష్ రావా మమ్మల్ని ప్రశ్నించేది?” అంటూ ఘాటుగా జవాబిచ్చారు. 

లగచర్ల రైతుకి బేడీలు వేయడంపై నిరసన తెలుపుతూ నిన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి, చేతులకు బేడీలతో శాసనసభ సమావేశానికి రావడంపై నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందిస్తూ, “మీరు బేడీలు వేసుకోవలసిన అవసరం లేదు. నేడో రేపో పోలీసులే మీ చేతులకు బేడీలు వేసి మీ ముచ్చట కూడా తీర్చుతారు. అయిన బేడీలు వేసుకోవలసిన  ఇద్దరూ (కేటీఆర్‌, హరీష్ రావు)లు బేడీలు వేసుకోకుండా తమ ఎమ్మెల్యేలకు బేడీలు వేయించి శాసనసభకు తీసుకువచ్చారు పాపం,” అని వ్యంగ్యంగా అన్నారు.

(video courtecy: Chota News)