రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తమకు ఆమోదం కాదని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇదివరకే చెప్పేశారు. కనుక నేడు (ఆదివారం) జగిత్యాల పట్టణంలో బతుకమ్మతో కూడిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకి ఆమె భూమిపూజ చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి సంబందించి ప్రభుత్వం ఇచ్చిన జీవోని పట్టించుకోబోమని కల్వకుంట్ల కవిత చెప్పారు. 22 అడుగుల ఎతుండే తెలంగాణ తల్లి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు, ముఖ్యంగా తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి చిహ్నమైన బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఊహించుకోలేమన్నారు. తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తొలగించడం అంటే మహిళలని అవమానించడంగానే భావిస్తామని అన్నారు. అందుకే బతుకమ్మతో కూడిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా తగ్గేదేలేదని కల్వకుంట్ల కవిత అన్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.
ప్రభుత్వ జీవోలను ధిక్కరించి 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ @RaoKavitha
ఈ సందర్భంగా కవిత గారి కామెంట్స్ 👇
♦️కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదు.
♦️ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామ గ్రామాన… pic.twitter.com/CCQCLqe3b2