సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 9న తెలంగాణ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ వచ్చి గౌరవం నిలుపుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి ఆహ్వానంపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ స్పందిస్తూ, “అసలు అక్కడ ప్రతిష్టిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా లేక కాంగ్రెస్ తల్లి విగ్రహామో రేవంత్ రెడ్డి ముందు చెప్పాలి. ఆనాడు మేధావులు, కవులు, కళారులు, శిల్పులు అందరి సమిష్టి నిర్ణయంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు తప్ప కేసీఆర్ ఏకపక్షంగా రూపొందించలేదు.
ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజలే తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు కూడా. తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఏదో ఆషామాషీ విగ్రహం కానేకాదు. తెలంగాణ రాష్ట్రం, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. కనుక ఆ తల్లి రూపురేఖలలో ఎటువంటి మార్పులు చేసిన మేము అంగీకరించం. తెలంగాణ సమాజం కూడా అంగీకరించదు.
కాదని మార్చి విగ్రహం ఏర్పాటు చేస్తే, మేము అధికారంలోకి రాగానే దానిని తొలగిస్తాము. సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయించారు. మేము అధికారంలోకి తిరిగి రాగానే దానిని కూడా అక్కడి నుంచి తొలగిస్తాము. అయినా ప్రభుత్వం మారిన ప్రతీసారి విగ్రహాలు, పేర్లు, నంబర్ ప్లేట్స్ మారుతుండాలా?ఇదెక్కడి తుగ్లక్ పాలన?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
సచివాలయంలో రేవంత్ రెడ్డి ప్రతిష్టిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా లేదా కాంగ్రెస్ తల్లి విగ్రహమా?
— BRS Party (@BRSparty) December 6, 2024
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టాడు. నాలుగేండ్ల తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది.. రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడ ఉండాలో… pic.twitter.com/vVcSoyuZCY