ఆ రెండు జిల్లాలకు ఆర్టీసీ డిపోలు మంజూరు

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్దపల్లి, ములుగు జిల్లాలు ఏర్పాటు చేశారు కానీ ఇంతవరకు ఆ రెండు జిల్లాలకి ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేయలేదు.

పెద్దపల్లి పారిశ్రామిక కేంద్రం కాగా, ములుగు జిల్లా మేడారంలో సమ్మక్కసారక్క ఆలయం ఉంది. కనుక ఈ రెండు జిల్లాలకు బస్ డిపోలు, జిల్లా కేంద్రం నుంచి కొన్ని మార్గాలలో కొత్త బస్సులు చాలా అవసరం. కనుక సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు ఆ రెండు జిల్లా కేంద్రాలలో ఆర్టీసీ డిపోలు మంజూరు చేశాను. జిల్లా మంత్రులకు ఈ జీవో కాపీలు అందజేస్తున్నాను,” అని చెప్పారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. అది ప్రభుత్వానికి చాలా భారమే అయినా ఎన్నికలలో ఇచ్చిన హామీకి కట్టుబడి మహాలక్ష్మి పదకాన్ని అమలు చేస్తోంది. గత ప్రభుత్వం హయంలో ఆర్డర్ పెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.