ఏపి సర్కార్ కి హైకోర్టులో ఎదురుదెబ్బ!

ఏపి సర్కార్ కోర్టులలో మొట్టికాయలు వేయించుకోవడం చాలా అరుదు అనే చెప్పవచ్చు. కానీ ఈ మద్యన అది కూడా వరుసగా మొట్టికాయలు వేయించుకొంటోంది. అమరావతి నిర్మాణానికి అది స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అమలుచేయలనుకొంటే, దానిని హైకోర్టు తప్పు పట్టింది. దానిలో ఉన్న లొసుగులని ఎత్తి చూపించింది. దానితో ఏపి సర్కార్ వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది.

తాజాగా ఆ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ గా కారెం శివాజీ నియామకం చెల్లదని తీర్పునిచ్చింది. కమీషన్ నియమనిబంధనల ప్రకారం ఆయన నియామకం జరుగలేదని ప్రసాద్ బాబు అనే ఒక వ్యక్తి వేసిన పిటిషన్ పై విచరణ జరిపిన హైకోర్టు అతని వాదనతో ఏకీభవించుతూ, చైర్మన్  నియామకం కోసం నిబంధనల ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి నియామకం చేపట్టాలని సూచించింది.