తమిళనాడు సిఎం జయలలిత ఓకె!

 తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురించి మళ్ళీ చాలా రోజుల తరువాత ఇవ్వాళ్ళ కొంత సమాచారం బయటకి వచ్చింది. ఆమెని దీపావళిలోగానే అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకొంటారని వార్తలు వచ్చినా నేటి వరకు కూడా ఆమె ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకొన్నారని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి ఏస్. రామచంద్రన్ మీడియాకి తెలిపారు. ఆమె ఇంటికి చేరుకోగానే మళ్ళీ యధాప్రకారం తన బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పారు. 

ఆమె ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ తో గత నెల 22వ తేదీన చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొని మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి రాబోతున్నారు. ఆమె తన ఇంటి నుంచే కొన్ని రోజులు పరిపాలన కొనసాగించవచ్చు.