రేపు 5 రాష్ట్రాలలో బంద్...సాధ్యమేనా?

కొన్ని రోజుల క్రితం ఆంధ్ర-ఓడిశా సరిహద్దుల వద్ద ఓడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో 30మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ చేయబడిన సంగతి తెలిసిందే. ఆరోజు నుంచి నేటి వరకు వారి అగ్రనేత రామకృష్ణ జాడ లేకుండా పోయింది. ఈ ఎన్కౌంటర్ తో మావోయిస్టులు చాలా గట్టి దెబ్బ తిన్నారు. కనుక మళ్ళీ తమ సత్తా చాటుకోవడం అనివార్యం అయ్యింది. అందుకే తమ సహచరుల ఎన్కౌంటర్ కి నిరసనగా రేపు అంటే నవంబర్ 3న ఆంధ్రా, తెలంగాణా, మహారాష్ట్ర, ఓడిశా, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో బంద్ కి పిలుపునిచ్చారు. అయితే వారికి అంత సామార్ధ్యం ఉందా? అంటే అనుమానమే. ఇప్పటికే ఎన్కౌంటర్ కారణంగా చాలా బలహీనపడిన మావోయిస్టులు తమ శక్తికి మించిన పని చేయాలనుకోవడం వలన, రేపు ఏ రాష్ట్రంలోను బంద్ పాటించకపోతే తమ బలహీనతని తామే బయటపెట్టుకొన్నట్లు అవుతుంది.