డిశంబర్ 2న తెరాస విజయోత్సవ సభ?

రాష్ట్రంలో కొత్త జిల్లాలకి ప్రతిపక్ష పార్టీలు అప్పుడే కమిటీలు వేసుకొని జిల్లా అధ్యక్షులని కూడా నియమించుకొంటున్నాయి. కానీ అధికారంలో ఉన్న తెరాస మాత్రం ఇంకా ఆ పని మొదలుపెట్టలేదు. నవంబర్ 4,5 తేదీలలో జిల్లా కమిటీలని ఏర్పాటు చేసే అవకాశం ఉందని నిజామాబాద్ తెరాస ఎంపి కవిత చెప్పారు. కమిటీల నియామకాల ప్రక్రియ పూర్తయిన వెంటనే నామినేటడ్ పదవుల భర్తీ కార్యక్రమం చేపడతారని కవిత చెప్పారు. 

తెరాస సర్కార్ రెండున్నరేళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంగా డిశంబర్ 2న హైదరాబాద్ లో బారీ బహిరంగ సభ జరుపబోతున్నట్లు కవిత ఈరోజు మీడియాకి తెలియజేశారు. ఆ మరుసటి రోజు నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల పర్యటనకి బయలుదేరుతారని ఆమె చెప్పారు.