మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సింగరేణిలో బిఆర్ఎస్ అనుబంద గుర్తింపు సంఘం టిజిబీకేఎస్ అధ్వర్యంలో సింగరేణి గనులు కార్మికులు నిరసనలు చేస్తున్నారు. సింగరేణి గనులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. సింగరేణి పరిధిలోని భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, నస్పూర్, ఇల్లందుల గనుల వద్ద కార్మికులు ధర్నాలో పాల్గొంటూ, ‘మోడీ హటావో సింగరేణి బచావో’ అని నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన నిరసనలు తెలియజేస్తున్నారు.
మంచిర్యాలలో నస్పూర్ చొరస్తా వద్ద ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, రాథోడ్ బాపురావు, దివాకర్, జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాధోడ్, స్థానిక బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. పెద్దపల్లిలో గోదావరి ఖని చౌరస్తా వద్ద నిర్వహించిన ధర్నాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం బ్లాకుల వద్ద జరుగుతున్న ధర్నాలలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్రేగా కాంతారావు, ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.