కర్ణాటక శాసనసభ ఎన్నికల షెడ్యూల్ జారీ

కేంద్ర ఎన్నికల కమీషన్‌ ప్రధానాధికారి రాజీవ్ కుమార్‌ బుదవారం ఉదయం కర్ణాటక శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. కేంద్ర ఎన్నికల కమీషన్‌ ప్రధానాధికారి రాజీవ్ కుమార్‌ బుదవారం ఉదయం కర్ణాటక శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. కర్ణాటకలో మొత్తం 224 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటన్నిటికీ మే 10వ తేదీన ఒకేసారి ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. మే 13వ తేదీన ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున నేటి నుంచి కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని రాజీవ్ కుమార్‌ తెలిపారు. 

 

ప్రస్తుతం కర్నాటకలో బిజెపి అధికారంలో ఉంది. 224 మంది సభ్యులున్న శాసనసభలో బిజెపికి 119, కాంగ్రెస్ పార్టీకి 75, జేడీఎస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అధికారం నిలుపుకోవాలని బిజెపి పట్టుదలగా ఉండగా, కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీలు కూడా ఈ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాలేకపోతే, బిజెపి ఒత్తిళ్ళను తట్టుకొంటూ మరో 5 ఏళ్ళు మనుగడ సాగించడం చాలా కష్టం. కనుక ఈ ఎన్నికలు వాటికీ చాలా కీలకమే. 

ఇక కర్ణాటక ఎన్నికలలో జెడిఎస్‌తో కలిసి పోటీ చేస్తామని బిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఇదివరకే ప్రకటించారు. కనుక జాతీయస్థాయి రాజకీయాలలో చక్రం తిప్పాలనుకొంటున్న కేసీఆర్‌కు కూడా ఈ ఎన్నికలలో సత్తా చాటుకోవడం చాలా ముఖ్యమే.