శాసనసభ ఎన్నికలకు బిఆర్ఎస్ సన్నాహాలు షురూ

సిఎం కేసీఆర్‌ 2018, డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినందున, ఈసారి కూడా అప్పుడే ఎన్నికలు జరుగుతాయి. ఆ లెక్కన సెప్టెంబర్‌ లేదా అక్టోబర్ నెలల్లో ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. అంటే మరో 6 నెలల్లో ఎన్నికల గంట మ్రోగబోతోందన్న మాట! కనుక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సోమవారం జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై రాబోయే నాలుగు నెలల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి దిశా నిర్దేశం చేశారు. 

జిల్లాల వారీగా బిఆర్ఎస్ ఇన్‌ఛార్జ్‌లను కూడా నియమించారు. వారి వివరాలు: 

హైదరాబాద్‌: దాసోజు శ్రవణ్ కుమార్, రంగారెడ్డి: ఎల్.రమణ, మెదక్‌: ఎగ్గె మల్లేశం, సంగారెడ్డి: వెంకట్రామిరెడ్డి, మేడ్చల్: పల్లా రాజేశ్వర్ రెడ్డి, కామారెడ్డి: విఠల్‌, సిద్ధిపేట: బి.వెంకటేశ్వర్లు, వికారాబాద్: పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి; 

వరంగల్‌,హనుమకొండ: ఎమ్‌.వీఎస్.ప్రభాకర్‌, యాదవరెడ్డి-యాదాద్రి, నల్లగొండ: కడియం శ్రీహరి; 

ఖమ్మం: శేరి సుభాష్ రెడ్డి, కొత్తగూడెం: భానుప్రసాద్, 

కరీంనగర్‌: బస్వరాజు సారయ్య, పెద్దపల్లి: ఎర్రోళ్ళ శ్రీనివాస్; జగిత్యాల: కె.దామోదర్, మంచిర్యాల: లక్ష్మణరావు; 

నిజామాబాద్‌: బండ ప్రకాష్, వనపర్తి, జోగులాంబ గద్వాల: తక్కళపల్లి రవీందర్‌రావు, నిర్మల్, అదిలాబాద్: ఎంసీ కోటిరెడ్డి, ఆసిఫాబాద్: పురాణం సతీష్; జైశంకర్ భూపాలపల్లి, ములుగు: ఏ.నర్సారెడ్డి; 

మహబూబ్‌నగర్‌, నారాయణపేట: కె.నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్: మహేందర్ రెడ్డి, సూర్యాపేట: ఎం.శ్రీనివాస్.