స్టేషన్ ఘన్‌పూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మొదటి నుంచి ఏవో ఒక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదటిసారి ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవులు కట్టబెడితే అవినీతి ఆరోపణలు రావడంతో కేసీఆర్ ఆయనను వెంటనే రెండు పదవులలో నుంచి తొలగించారు. కానీ నేటికీ కడియం శ్రీహరిని కాదని ఎమ్మెల్యేగా ఆయనకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
కడియం శ్రీహరి కూడా ఆయనపై అనేక ఆరోపణలు చేశారు. అయితే వాటిని రాజకీయ విభేధాలుగానే అందరూ చూశారు తప్ప ఎవరూ తీవ్రంగా పరిగణించలేదు. కానీ తాజాగా జానకీపురం గ్రామసర్పంచ్ నవ్య (బిఆర్ఎస్) మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా ఆయనపై ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యే రాజయ్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ, “గ్రామాభివృద్ధికి నిధులు కావాలంటే ఆయన కోరిక తీర్చాలంటాడు. నా మీద ప్రేమతోనే రైతుబంధు ఇచ్చానంటాడు. నా భర్తలేకుండా తనతో బయటకు రావాలంటాడు. ఒంటరిగా వస్తే షాపింగులు, సినిమాలకు తీసుకువెళ్తానంటాడు. తాను ఏం చెపితే అదే చేయాలట... ఎలా ఉండమంటే అలాగే ఉండాలట! ఆయన నన్ను చాలా కాలంగా ఆయన లైంగికంగా వేధిస్తున్నాడు. పార్టీలో కొంతమంది మహిళలు సాటి మహిళనైన నాకు అండగా నిలబడాలనుకోకుండా వారు కూడా ఆయనకే వంతపాడుతున్నారు. నాపై ఒత్తిడి చేస్తున్నారు. ఏం ఆయనకి ఇంట్లో భార్యా, పిల్లలు లేరా? అక్కా చెల్లి, అమ్మా ఎవరు లేరా? వాళ్ళింట్లో ఆడాళ్ళందరూ నీతినిజాయితీగా, పవిత్రంగా ఉండాలి. ఊళ్ళో ఆడాళ్ళు అందరూ చెడిపోవాలా? ఇటువంటి వాళ్ళ వలననే మా నాయకుడు కేసీఆర్, కేటీఆర్‌లకు చెడ్డపేరు వస్తోంది,” అంటూ నవ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సర్పంచిగా నిధులడిగితే కోరిక తీర్చమంటున్నారు: Station Ghanpur Sarpanch - TV9#StationGhanpur #Sarpanch #MLATRajaiah pic.twitter.com/sCbtBJghma
వీడియో టీవీ9 సౌజన్యంతో...