నేడు కరీంనగర్‌లో కాంగ్రెస్‌ సభ... షరతులు వర్తిస్తాయి!

నేడు కరీంనగర్‌లో అంబేడ్కర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరుగబోతోంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా దీనిని నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకొన్నరోజును గుర్తు చేసుకొంటూ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు ఈ బహిరంగసభలో నిర్వహిస్తున్నారు. 

కనుక తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్ని ఈ సభకు అతిధిగా హాజరుకాబోతున్నారు. అలాగే ఛత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్, ఇంకా పలువురు సీనియర్ కాంగ్రెస్‌ నేతలు ఈ సభకు హాజరుకాబోతున్నారు. 

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఈ సభను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ సభకు సుమారు 50 వేలమందితో అట్టహాసమగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకొంతోంది. అయితే స్టేడియం కేవలం 15వేల మందికి మాత్రమే సరిపోతుంది కనుక అంతకు మించకుండా సభను నిర్వహించుకోవాలని కరీంనగర్‌ పోలీసులు షరతు విధించారు. 

సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటలలోగా సభ నిర్వహించుకోవాలని, పటాసులు పేల్చరాదని, లౌడ్ స్పీకర్స్ శబ్ధం పరిమితికి మించరాదని, అదనపు భద్రత కోసం సిసి కెమెరాలు అమర్చుకోవాలని, సభని షూట్ చేయడం కోసం డ్రోన్ కెమెరాలు వినియోగించరాదంటూ మొత్తం 23 షరతులు విధించారు. వీటిని ఉల్లంఘించిన్నట్లయితే సభకు అనుమతి రద్దు చేసి చట్టప్రకారం కఃర్యాలు తీసుకొంటామని స్పష్టం చేశారు. 

కానీ 50 వేలమందికి తక్కువ కాకుండా ఈ సభ నిర్వహించి తీరుతామని సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ చెప్పారు. లేకుంటే ఇన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ సభ నిర్వహించుకొని ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అధికార బిఆర్ఎస్ సభలకు ఎటువంటి ఆంక్షలు విధించని పోలీసులు, ప్రతిపక్షాల సభలకు మాత్రం అనేక ఆంక్షలు విధిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.