తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 9 ఏళ్ళు కావస్తున్నా ఇంకా రాష్ట్ర ప్రజలకి 'వైఎస్సార్ మోత' తప్పడంలేదు. ఏపీలో అన్నతో విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొని కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల, ఆనాడు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భజన చేస్తూ, ప్రజలని కూడా చేయమని కోరుతున్నారు. ఈ తొమిదేళ్ళలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీలేదని ఆనాడు తన తండ్రే అంతా చేశారని చెప్పుకొంటున్నారు.
ఏపీలో ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఏవిదంగా తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చాదో అదేవిదంగా తెలంగాణలో కూడా వైఎస్ షర్మిల తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో మళ్ళీ రాజన్న రాజ్యం స్థాపిస్తానని చెప్పడం తెలంగాణ ఉద్యమాలని, ప్రజాపోరాటలని అవమానించడమే కదా?
తెలంగాణలో మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలే అధికారంలోకి రాలేకపోతున్నాయి. అటువంటిది... హటాత్తుగా ఏపీ నుంచి ఊడిపడి పార్టీ పెట్టుకొని పాదయాత్రలు, వైఎస్ భజన చేస్తే అధికారంలోకి వచ్చేస్తానని వైఎస్ షర్మిల ఎలా అనుకొంటున్నారో తెలీదు కానీ రాబోయే ఎన్నికలలో ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేయాలని నిశ్చయించుకొన్నారు.
ఆమెకి మద్దతుగా వైఎస్ విజయమ్మ కూడా అప్పుడే ప్రచారం మొదలుపెట్టేశారు. ఆమె నిన్న పాలేరు ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మాకు పులివెందుల ఎలాగో ఇక్కడ వైఎస్ షర్మిలకి పాలేరు అలాగ! కనుక మీరు నా కూతురికి పాలేరుని బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆమెకి మీరు అండగా నిలబడితే మీకు ఆమె అండగా నిలబడి మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్యలున్నా తీర్చుతుంది,” అని విజయమ్మ అన్నారు.
పాలేరును నా బిడ్డకు బహుమతిగా ఇవ్వండి: వైఎస్ విజయమ్మ
FULL VIDEO - https://t.co/RVi1HPM0iV#YSVijayamma #khammam #YSSharmila #YSRTP #YSRTelanganaParty #YSR #Paleru #Telangana #NTVTelugu pic.twitter.com/w0U6rotoTd
(Video courtecy NTV)