
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కొత్త సచివాలయం, దాని ఎదురుగా నిర్మించబడుతున్న అమరవీరుల స్తూపం, స్మారకమందిరం ఫోటోలని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ త్వరలో ప్రారంభోత్సవం జరుగబోతున్నట్లు తెలిపారు. కొత్త సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న సిఎం కేసీఆర్ పుట్టినరోజునాడు సచివాలయం ప్రారంభోత్సవం చేయాలనుకొన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ జయంతి రోజున ప్రారంభోత్సవం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోగా సచివాలయంలో లాండ్ స్కేపింగ్, ఇంటీరియర్ పనులు, మసీదు, ఆలయ నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయి.
మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేసిన సచివాలయం దాని ఎదురుగా అమరవీరుల స్తూపం సాయం సంధ్యా వేళలో చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి.