కోదండరాం ఇప్పుడు ఏమి చేస్తారో?

తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్రంలో రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకు రైతు సంఘాలతో కలిసి రేపు ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేయాలనుకొన్నారు. అందుకు అనుమతి కోరుతూ ఆయన గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో వారం రోజుల క్రితమే దరఖాస్తు చేసుకొన్నారు. కానీ పోలీసులు ఆయన దీక్షకి అనుమతివ్వలేదు. కనుక పోలీసుల అనుమతి లేకపోయినా ఆయన దీక్షకి కూర్చోంటారా లేకపోతే దీక్షని వాయిదా వేసుకొంటారో చూడాలి. తాము రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే దీక్ష చేయాలనుకొంటున్నాము తప్ప ధర్నాలు చేయడం లేదని, కనుక శాంతియుతంగా చేసుకొనే తమ దీక్షకి అనుమతించాలని ప్రొఫెసర్ కోదండరాం పోలీసులకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 

ఒకప్పుడు తెరాస అధ్యక్షుడు కెసిఆర్, ఆ పార్టీ నేతలతో కలిసి ప్రొఫెసర్ కోదండరాం అనేక ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు చేశారు. అవన్నీ తెలంగాణా సాధన కోసమే చేస్తున్నావే కనుక వాటిని అడ్డుకోవడం సరికాదని అప్పుడు కెసిఆర్ చాలా గట్టిగా సమర్ధించుకొన్నారు. కానీ ఇప్పుడు రైతుల సమస్యలపి శాంతియుతంగా దీక్ష చేసుకోవడానికి ప్రొఫెసర్ కోదండరాంకే అనుమతి నిరాకరించడం విస్మయం కలిగిస్తుంది.