మరో రైల్వే ప్రాజెక్టు పూర్తి: ప్రజలకి మోడీ అభినందనలు

తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మూడు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే పర్లీ వైజ్‌నాథ్-వికారాబాద్ రైల్వేలైన్ విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని రైల్వేశాఖ ట్విట్టర్‌లో తెలియజేసింది. మహారాష్ట్రలోని లాతూర్ రోడ్ నుంచి పర్లీ వైజ్‌నాథ్ వరకు 268 కిమీ మేర రైల్వేలైన్ విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని రైల్వేశాఖ తెలియజేసింది.

రైల్వేశాఖ చేసిన ట్వీట్‌ని ప్రధాని నరేంద్రమోడీ రీ ట్వీట్‌ చేస్తూ, “ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం పొందబోతున్న తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మూడు రాష్ట్రాల ప్రజలకి అభినందనలు,” అని సందేశం పెట్టారు.

ఈసారి కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖకి ఏకంగా 2.43 లక్షల కోట్లు కేటాయించడంతో దేశవ్యాప్తంగా ఇటువంటి పలు రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఏర్పడింది.