ఆదాయపన్ను పరిమితి రూ.7 లక్షలకి పెంపు

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో 2023-24 సం.ల బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. దానిలో మద్యతరగతి వర్గం ప్రజలకి ఉపశమనం కల్పిస్తూ ఆదాయపన్ను పరిమితిని రాయితీని రూ.7 లక్షలకి పెంచుతున్నట్లు ప్రకటించారు. 

వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదు. రూ.3-6 లక్షల వరకు 5%, రూ.6 నుంచి 9 లక్షల వరకు 10%, రూ.9 లక్షలు-రూ.12 లక్షల వరకు 15%, రూ.12 నుంచి 15 లక్షల వరకు 20%, రూ.15 లక్షలు పైబడి వార్షిక ఆదాయం కలిగినవారికి 30% పన్ను ఉంటుంది. 

సీనియర్ సిటిజన్స్ పొదుపు పధకం పరిమితి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకి పెంచబడింది. 

బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ (పన్ను) పెంచుతున్నట్లు ప్రకటించినందున వాటి ధరలు మరింత పెరగనున్నాయి. సైకిల్స్, టైర్లు, సిగరెట్లు, బ్రాండెడ్ దుస్తులు ధరలు పెరుగనున్నాయి. ల్యాప్ టాప్, కెమెరా లెన్స్, టీవీలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, లిథియం ఐయాన్ బ్యాటరీలు, వజ్రాలు, ఆటవస్తువుల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి.