5.jpg)
సింగరేణి సంస్థకి కొత్తగా ఇద్దరినీ డైరెక్టర్స్ నియమిస్తూ సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా, అడ్రియాల కోల్ మైన్‌లో జీఎం (ఆపరేషన్స్)గా ఎన్‌వీకే శ్రీనివాస్‌ని, మణుగూరు కోల్ మైన్‌లో జీ.వేంకటేశ్వర రెడ్డిని జీఎం(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్)ని డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
ఆపరేషన్స్ డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్ మంగళవారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఎన్‌వీకే శ్రీనివాస్‌ని నియమించారు. ఇక ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ పదవి గత 5 ఏళ్లుగా ఖాళీగానే ఉంది. దానికి జీ.వేంకటేశ్వర రెడ్డిని నియమించారు. ఈ రెండు పోస్టుల భర్తీకి సీనియారిటీ ప్రాతిపదికన పది మంది అధికారులని ఎంపిక చేసి వారికి హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఇంటర్వ్యూ చేసి వారిలో వీరిద్దరినీ డైరెక్టర్స్ గా నియమిస్తూ సీఎండీ ఎన్. శ్రీధర్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. వారిరువురిపదవీకాలం నేటి నుంచి రెండేళ్ళు ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.