కరీంనగర్ ఆర్టీసీ డిపో ముందు ఈరోజు ఉదయం ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. తమకి నామమాత్రపు వేతనాలు ఇస్తూ, ఆర్టీసీ అధికారులు వేధింపులకి పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజుల ముందు కూడా ఓసారి వారు ఇదేవిదంగా ఆందోళన చేసినప్పుడు టీఎస్ఆర్టీసీ అధికారులు అద్దెబస్సుల యజమానులతో చర్చలు జరిపారు. కానీ తమ జీతాలు పెంచలేదు... తమతో అధికారుల వ్యవహరించే తీరు ఏమాత్రం మారలేదని అద్దె బస్సుల డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ సమస్యలని పరిష్కరించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.
డ్రైవర్లు హటాత్తుగా ధర్నా మొదలుపెట్టడంతో శనివారం తెల్లవారుజాము నుంచి చుట్టుపక్కల పల్లెలకు వెళ్లాల్సిన పల్లెవెలుగు బస్సులతో చాలా బస్సులు డిపో నుంచి బయటకు రాకపోవడం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.