మంత్రి కేటీఆర్‌ మరో సరికొత్త రికార్డ్

తెలంగాణ రాష్ట్రంలో అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోను మంత్రి కేటీఆర్‌ మంచి బలమైన, సమర్ధుడైన నాయకుడిగా ఎప్పుడో పేరు సంపాదించుకొన్నారు. ఇప్పుడు అంతర్జాతీయంగా అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో కూడా 12వ ర్యాంక్ సంపాదించుకొన్నారు. దావోస్ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ‘సోషల్ మీడియా ద్వారా సమాజంపై అత్యంత ప్రభావం చూపుతున్నవారి జాబితాని విడుదల చేసింది. దానిలో భారత్‌ నుంచి ఇద్దరే వ్యక్తులున్నారు. ఒకరు మంత్రి కేటీఆర్‌ కాగా మరొకరు ఢిల్లీలోని ఆమాద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా. వారిలో కేటీఆర్‌ వ్యక్తిగత హోదాలో 12వ ర్యాంక్‌లో నిలువగా, మంత్రి హోదాలో 22వ ర్యాంక్‌లో నిలిచారు.  రాఘవ చద్దా వ్యక్తిగత హోదాలో 23వ ర్యాంక్‌లో నిలిచారు.