
బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన రామచంద్రభారతి, సింహయాజీ, నందా కుమార్ ముగ్గురు నిందితులతో తమకి ఎటువంటి సంబందామూ లేదని చెప్పిన బిజెపి నేతలు అప్పుడు భుజాలు ఎందుకు తడుముకొన్నారు? వారి తరపున కోర్టులలో కేసులు ఎందుకు వేశారు? ఈ కేసు దర్యాప్తుని హైకోర్టు సీబీఐకి బదిలీ చేస్తే ఇప్పుడు చంకలు ఎందుకు గుద్దుకొంటున్నారు? సంబందం లేదని చెప్పిన ఆ ముగ్గురు నిందితులని భుజాలకెత్తుకొని ఎందుకు మోస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ బిజెపి నేతలకు ట్వీట్ చురకలు వేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశ్యిస్తూ పోస్ట్ చేసిన తాజా ట్వీట్‌లో “మీ బండారమంతా కెమెరాల సాక్షిగా బయటపడినప్పుడు మీ వెన్నులో వణుకు మొదలైంది. ఆ కేసును సీబీఐకి అప్పగించగానే అందరూ సంబురపడుతున్నారు. అంటే మీ మోడీ జేబు సంస్థకి ఈ కేసు చిక్కిందనే కదా?ఒకప్పుడు సిబిఐ కి కేసు ఇస్తే నిందితులు భయపడే పరిస్థితి నుండి ఇవ్వాళ సిబిఐ కి కేసు అప్పజెప్తే మీరు సంబరాలు చేసుకుంటున్నారు అంటేనే ఆ సంస్థను మీ హయాంలో ఎంత నీరుగార్చారో అర్థమవుతుంది కెమెరాల సాక్షిగా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిన దొంగలు మీరు,” అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కిషన్ రెడ్డి గారూ! మీకో సూటి ప్రశ్న.
ఆ సాములతో అసలు సంబంధమే లేదన్నోళ్లు…ఈ స్కాము సీబీఐకి అప్పగించగానే చంకలెందుకు గుద్దుకుంటున్నరు?
మీ బండారమంతా కెమెరా కన్నుకు చిక్కినప్పుడే.. మీ వెన్నులో వణుకు మొదలైంది
అప్పుడు భుజాలు తడుముకున్న మీరు.. ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారు?