భారత్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడం తాజ్మహల్! అయితే మాకేంటి.... ఇన్నేళ్ళుగా ఇంటిపన్ను కట్టకపోతే ఎలా? అంటున్నారు ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు. అనడమే కాదు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి నోటీస్ పంపించారు. తాజ్మహల్కి రూ.1.4 లక్షల ఇంటి పన్ను బకాయి ఉందని నోటీస్ పంపించారు. రెండు వారాలలోగా బకాయిలు చెల్లించాలని నోటీసులో గడువు ఇచ్చారు.
తాజ్మహల్తో పాటు యమునా నదికి సమీపంలోని మొఘల్ రాజు సమాది ఎత్మాద్-ఉద్-దౌలాద్కి కూడా ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఇంటిపన్ను నోటీస్ పంపారు. దానికి ఈ ఆర్ధిక సంవత్సరానికి రూ.11,098 బాకీతో కలిపి రూ.47,943 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.