పల్లె దవాఖానాలలో 1,492 మంది వైద్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్‌

తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో ఒక్కోటి చొప్పున వైద్య కళాశాలల ఏర్పాటుకి జోరుగా సన్నాహాలు చేస్తూనే, పల్లెటూర్లలో దవఖానాలను కూడా బలోపేతం చేసేందుకు ఏకంగా 1,492 మంది వియద్యుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి మంజూరు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్ధిక శాఖ జీవో నంబర్: 1563ని జారీ చేసింది. జిల్లాలవారీగా వైద్యుల నియామకాలు ఈవిదంగా చేయబోతోందని మంత్రి హరీష్‌ రావు జాబితాని కూడా ట్విట్టర్‌లో ప్రకటించారు. ఆ వివరాలు: