రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలని ఏర్పాటు చేయడంతో వాటి కోసం వివిధ శాఖలలో బారీగా ఉద్యోగులని నియమించవలసిన అవసరం ఏర్పడింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వాటి కోసం 2206 పోస్టుల కోసం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలో 2019 ఉద్యోగులని నియమించబోతోంది. ఆ తరువాత విద్యాశాఖలో 85, రోడ్లు భవనల శాఖలో 12 మంది ఉద్యోగులని నియమించదానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్దినేట్స్-139, సీనియర్ అసిస్టెంట్స్-130 మంది, జూనియర్ అసిస్టెంట్స్-80, తహసిల్దార్-93, రికార్డ్ అసిస్టెంట్స్-42, వాచ్ మ్యాన్-53 పోస్తులని భర్తీ చేయబోతోంది.
అదేవిధంగా విద్యాశాఖలో 85 మండల విధ్యాధికారులని నియమించబోతోంది. రోడ్లు భవనాల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-4, సూపరింటెండెంట్- 4, జూనియర్ అసిస్టెంట్స్-4 పోస్టులని భర్తీ చేయబోతోంది.
రాష్ట్ర ఆర్ధిక శాఖా కార్యదర్శి ఎన్.శివశంకర్ ఈ ఊతర్వులని బుదవారం జారీ చేశారు. అవకాశం ఉన్న చోట ప్రత్యక్ష నియామకాల ద్వారా, లేనిచోట పదోన్నతుల ద్వారా ఉద్యోగాలని భర్తీ చేస్తారు. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలవుతుంది. కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయడం వలననే రాష్ట్రంలో ఇన్ని కొత్త ఉద్యోగాలు సృష్టించబడటం విశేషమే.