ఇదిగిదిగో తెలంగాణ కొత్త సచివాలయం... మార్చినాటికి సిద్దం?

తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచేలా ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మిస్తోంది. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయినట్లు తాజా ఫోటోలు చూస్తే అర్దమవుతుంది. సిఎం కేసీఆర్‌ స్వయంగా కొత్త సచివాలయ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు, కాంట్రాక్టర్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.    

కొత్త సచివాలయ నిర్మాణ పనులు నవంబర్‌ 2020లో ప్రారంభం అయినప్పటికీ మద్యలో కరోనా కారణంగా చాలా ఆలస్యమైంది. లేకుంటే ఈ ఏడాది దసరనాడు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరగవలసి ఉంది. ఇదివరకు దీనిలో 1,000 కార్మికులు పనిచేసేవారు. దసరా పండుగ తర్వాత నుంచి అదనంగా మరో 1,500 మంది కార్మికులు రేయింబవళ్ళు పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలోగా కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్దం కావచ్చని సమాచారం.

రూ.616 కోట్ల భారీ బడ్జెట్‌తో 25.5 ఎకరాల సువిశాలమైన స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు. ఏడు అంతస్తులతో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం (బిల్ట్ అప్‌ స్పేస్)తో సకల ఆధునిక హంగులు, సదుపాయాలు ఉండేవిదంగా దీనిని నిర్మిస్తున్నారు.