నారా వారి ఆస్తులు అంతేనా?

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు తమ కుటుంబ సభ్యులందరి ఆస్తుల వివరాలని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థిర, చరాస్తుల విలువ మొత్తం రూ. 3.73 కోట్లు. ఆయన భార్య భువనేశ్వరి ఆస్తుల విలువ మొత్తం రూ.38.66 కోట్లు. నారా లోకేష్ ఆస్తుల విలువ మొత్తం రూ.14.50 కోట్లు, ఆయన భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ మొత్తం రూ.5.37 కోట్లు, వారి కుమారుడు దేవాంశ్ ఆస్తుల విలువ మొత్తం రూ.11.08 కోట్లు అని ప్రకటించారు.

ఇప్పటికి వరుసగా 6 సం.ల నుంచి తమ కుటుంబ ఆస్తుల వివరాలని ప్రతీ ఏటా ప్రకటిస్తున్నామని నారా లోకేష్ చెప్పారు. ఇవి కాకుండా తమకి మరెక్కడా ఆస్తులు లేవని, ఒకవేళ ఉన్నట్లు ఎవరైనా రుజువు చేయగలిగితే అవి వారికే రాసి ఇచ్చేస్తామని లోకేష్ చెప్పారు.