మునుగోడులో టిఆర్ఎస్‌ విజయం

సర్వత్రా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ విజయం సాధించింది. టిఆర్ఎస్‌ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప బిజెపి ప్రత్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,117 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రెండు, మూడు, 15వ రౌండ్లలో మాత్రమే బిజెపి కాస్త ఆధిక్యత కనబరచగలిగింది. మిగిలిన అన్ని రౌండ్లలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి ఆధిక్యతలో కొనసాగుతూ చివరికి విజయం సాధించారు.