సంబంధిత వార్తలు
మునుగోడు ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో కొద్దికొద్దిగా టిఆర్ఎస్ ఆధిక్యత పెరుతోంది. కొద్ది సేపటి క్రితం 5వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీనిలో టిఆర్ఎస్కి 6,162 ఓట్లు, బిజెపికి 5,245 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 2,670 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ రౌండ్లో టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 917 ఓట్లు సాధించారు. ఇక 5 రౌండ్లలో కలిపి టిఆర్ఎస్కి 32,225 బిజెపికి 30,974, కాంగ్రెస్‌కి 9,656 ఓట్లు పోల్ అయ్యాయి. ఐదు రౌండ్లలో కలిపి టిఆర్ఎస్కి కేవలం 1,251 ఓట్లు ఆధిక్యతలో కొనసాగుతోంది.