సంబంధిత వార్తలు
ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మునుగోడు ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైంది. ఊహించినట్లే టిఆర్ఎస్, బిజెపిల మద్య నువ్వా నేనా అన్నట్లు ఆధిక్యతలు కొనసాగుతున్నాయి. మొదటి రౌండులో టిఆర్ఎస్‌కి 6096, బిజెపికి 4904 ఓట్లు రాగా, రెండో రౌండులో టిఆర్ఎస్‌కి 7771, బిజెపికి 8622 ఓట్లు, మూడో రౌండులో టిఆర్ఎస్‌కి 7010, బిజెపికి 7426 ఓట్లు పోల్ అయ్యాయి. టిఆర్ఎస్‌కి 4854 బిజెపికి 4555 ఓట్లు పోల్ అయ్యాయి. నాలుగు రౌండ్లలో కలిపి టిఆర్ఎస్‌కి 26,343 ఓట్లు, బిజెపికి 25,730 ఓట్లు పోల్ అయ్యాయి.