పోతురాజుగా రాహుల్ గాంధీ.... కొరడా దెబ్బలు!

భారత్‌ జోడో పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఈరోజు సంగారెడ్డిలో ప్రవేశించినప్పుడు స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనకు విలక్షణంగా స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిభింభించే పోతురాజులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి కొరడా చేతిలో తీసుకొని పోతురాజులా కొట్టుకొంటూ విన్యాసం చేసి అందరినీ అలరిస్తుండగా రాహుల్ గాంధీ కూడా ముచ్చటపడి ఆయన చేతిలో నుచి కొరడా తీసుకొని పోతురాజులా కొట్టుకొన్నారు. అది చూసి ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉత్సాహంతో ఈలలు వేస్తూ, రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. 

రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్రపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అది ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం తప్పితే, పార్టీకి, దేశానికి ఏవిదంగాను ఉపయోగపడదని అన్నారు. కానీ ఈ యాత్రతో నేను చాలా నేర్చుకొంటున్నానని రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ గాంధీ పోతురాజుగా మారిన ఈ దృశ్యాన్ని మీరు చూసి ఆనందించండి.     

వీడియో ఈనాడు సౌజన్యంతో: