గుజరాత్‌ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ జారీ

కేంద్ర ఎన్నికల కమీషన్‌ కొద్దిసేపటి క్రితం గుజరాత్‌ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్‌ 1, 5 తేదీలలో రెండు దశలలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలియజేసింది. మొత్తం 182 సీట్లు కలిగిన గుజరాత్‌ శాసనసభ గడువు 2023, ఫిభ్రవరి 18తో ముగియనుంది. కనుక ఆలోపుగా ఎన్నికల ప్రక్రియ ముగించవలసి ఉంటుంది కనుక డిసెంబర్‌లో 1,5 తేదీలలో పోలింగ్ నిర్వహించి 10వ తేదీన ఫలితాలు ప్రకటించనుంది. 

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ 

ఎన్నికల నోటిఫికేషన్‌: మొదటి దశకు నవంబర్‌ 5, రెండవ దశకు నవంబర్‌ 10వ తేదీ. 

నామినేషన్ల స్వీకరణ: మొదటి దశకు అదే రోజు నుంచి నవంబర్‌ 14వరకు, రెండో దశకు నవంబర్‌ 17వరకు. 

నామినేషన్ల పరిశీలన: మొదటిదశకు నవంబర్‌ 15, రెండో దశకు నవంబర్‌ 18వ తేదీన. 

నామినేషన్ల ఉపసంహరణ: మొదటిదశకు నవంబర్‌ 17, రెండో దశకు నవంబర్‌ 21 వరకు గడువు. 

పోలింగ్: మొదటిదశ డిసెంబర్‌ 1న, రెండో దశలో డిసెంబర్‌ 5 తేదీన. 

ఓట్ల లెక్కింపు, మరియు ఫలితాల ప్రకటన: డిసెంబర్‌ 10వ తేదీన. 

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలషెడ్యూల్

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఇదివరకే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. 

నవంబర్‌ 12న ఒకే దశలో పోలింగ్ నిర్వహించి, రెండు రాష్ట్రాలకు డిసెంబర్‌ 10వ తేదీన ఫలితాలు ప్రకటించనుంది.