భాజపాలో చేరిన ప్రముఖ నటుడు

ప్రముఖ మలయాళీ సినీ నటుడు సురేష్ గోపి ఇవ్వాళ్ళ భాజపాలో చేరారు. నిజానికి ఆరు నెలల క్రితమే ఆయనకి మోడీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వం కల్పించింది. ఆ సమయంలో జరిగిన కేరళ శాసనసభ ఎన్నికలలో భాజపా తరపున పోటీ చేయమని ఆహ్వానించింది కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు భాజపాలో చేరారు కనుక ఇక నుండి పార్టీ తరపున రాష్ట్రంలో రాజకీయాలలో యాక్టివ్ గా వ్యవహరించే అవకాశం ఉంది. 

దక్షిణాది రాష్ట్రాలలో కూడా పార్టీని విస్తరించాలని భాజపా అధిష్టానం చాలా కలలు కంటోంది. మూడేళ్ళ క్రితం వరకు కర్ణాటకలో భాజపాయే రాజ్యం ఏలింది కానీ ఎడ్యూరప్ప పుణ్యామాని ఆ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. కానీ భాజపాకి మళ్ళీ అవినీతిపరుడైన ఆ ఎడ్యూరప్పే దిక్కయ్యారు. ఆ రాష్ట్రంలో పాత్రీని మళ్ళీ ఆయన చేతిలోనే పెట్టింది. వచ్చే ఎన్నికలలో భాజపా అధికారంలోకి తీసుకువచ్చే వరకు తన స్వంత ఇంటిలో అడుగు పెట్టనని శపథం చేశారు.

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో అధికార పార్టీలకి ప్రత్యమ్నాయంగా ఎదగాలని భాజపా చాలా కలలు కంటున్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేవు. కేరళలో అవకాశం ఉన్నప్పటికీ అక్కడ భాజపాకి బలం లేదు. కనుక ఇక నుంచి ఆ రాష్ట్రంలో మెల్లగా పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తుందేమో?