హైదరాబాద్‌కి మరో పచ్చటి అలంకారం గండిపేటలో ఎకో పార్క్

తెలంగాణ ఏర్పడక మునుపే హైదరాబాద్‌ నగరం చాలా అభివృద్ధి చెందింది. దానిని ఈ 8 ఏళ్ళలో తెలంగాణ ప్రభుత్వం వందరెట్లు అభివృద్ధి చేసింది. ఈ 8ఏళ్ళలోనే సుమారు 35కి పైగా ఫ్లైఓవర్లు అండర్ పాస్ రోడ్లు, స్కైవేలు, కేబిల్ బ్రిడ్జి (దుర్గంచెరువు) నిర్మించింది. వీటితో పాటు నగరంలో ఎక్కడికక్కడ సుందరీకరణ పనులు చేపడుతూ, అర్బన్ పార్కులు, అర్బన్ ఫారెస్టులు ఏర్పాటుచేస్తూ  పచ్చదనం పెంచుతూ హైదరాబాద్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తోంది. తాజాగా గండిపేటలో కొత్తగా నిర్మించిన ఎకో పార్కును రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఇదే విషయం తెలియజేస్తూ ట్విట్టర్‌లో ఆ ఫోటోలను ప్రజలతో షేర్ చేసుకొన్నారు.