ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (82) ఈరోజు ఉదయం కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీ సమీపంలోగల గురుగావ్లో మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు.
యూపీ, దేశ రాజకీయాలలో అత్యంత సీనియర్లలో ములాయం సింగ్ కూడా ఒకరు. కనుక ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్రమోడీతో సహా వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికార, ప్రతిపక్ష నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా ములాయం మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ తెలంగాణ సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశానికి గట్టిగా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. కనుక ములాయం అంత్యక్రియలకు కేసీఆర్ లేదా తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతినిధి హాజరయ్యే అవకాశం ఉంది.