24.jpg)
సిఎం కేసీఆర్ తాను ఏర్పాటుచేయబోయే కొత్త జాతీయ పార్టీ గురించి ఆదివారం ప్రగతి భవన్‌లో పార్టీ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన కొత్తపార్టీ గురించి కొన్ని వివరాలు బయటపెట్టారు. ఆ వివరాలు..
• టిఆర్ఎస్ పేరునే మార్చి అదే గుర్తు, అదే రంగు జెండాతో జాతీయపార్టీగా మార్చబడుతుంది. జెండా మద్యలో కారుగుర్తుకు బదులు భారతదేశం బొమ్మ ఉంటుంది.
• జాతీయ పార్టీ ఏర్పాటులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ విదంగా చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.
• జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండా అక్టోబర్ 5వ తేదీన మధ్యాహ్నం 1.19 గంటలకు ప్రగతి భవన్‌లో ప్రకటిస్తానని చెప్పారు.
• డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు.
• బిజెపిని గద్దె దింపడమే తన తొలి లక్ష్యమని చెప్పారు.
• జాతీయపార్టీ ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేయవలస్సీ వస్తుంది కనుకనే విమానం కొనుగులుచేస్తున్నట్లు సిఎం కేసీఆర్ చెప్పారు.
• దేశవ్యాప్తంగా కొన్ని పార్టీలు కొత్తగా ఏర్పాటుచేయబోతున్న ఈ జాతీయ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
• దేశంలో వివిద రాష్ట్రాలలో ప్రజలు, పలు పార్టీలు, మీడియా సంస్థలు, మేధావులు, ఆర్ధిక నిపుణులు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని కనుక ఇతర రాష్ట్రాలకు పార్టీని విస్తరించడంలో పెద్దగా ఇబ్బంది ఉండదని అన్నారు.
• ఆమ్ ఆద్మీవంటి చిన్న పార్టీ గట్టిగా ప్రయత్నించి పంజాబ్ రాష్ట్రానికి కూడా విస్తరించి, అధికారం చేజిక్కించుకొంది. దాని కంటే పెద్ద పార్టీ, సుదీర్గ పోరాట చరిత్ర కలిగిన పార్టీ టిఆర్ఎస్. కనుక జాతీయపార్టీగా సులువుగానే నిలద్రొక్కుకోగలదని సిఎం కేసీఆర్ అన్నారు.
• టిఆర్ఎస్ నేతలకు వివిద రాష్ట్రాల ఇన్‌చార్జ్ లుగా నియమిస్తామని వారు ఆయా రాష్ట్రాలలో పార్టీ వ్యవహారాలు చూసుకోవలసి ఉంటుందని చెప్పారు.
• మునుగోడు ఉపఎన్నికలలో జాతీయ పార్టీగా టిఆర్ఎస్ పోటీ చేస్తుందని చెప్పారు.