కరకు కసాయి నిజాం నవాబుల పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజు నేడు. 1948, సెప్టెంబర్ 17వ తేదీన భారత్ సైన్యం నిజాం సేనలను ఓడించి తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు నిజాం పాలన నుంచి విముక్తి కల్పించింది. కనుక తెలంగాణ ప్రజలు ఈరోజును విమోచన దినంగా భావిస్తుంటారు.
అయితే మానిన ఆనాటి గాయాలను మళ్ళీ కెలుక్కొని కొట్లాడుకోవడం మంచిది కాదని చెపుతున్న టిఆర్ఎస్ ఈరోజు జాతీయ సమైఖ్య దినంగా ప్రకటించింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఈ వేడుకలు జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి నేతలు కలిసి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుపుతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మూడు రోజులు ఈ ఉత్సవాలు జరపాలని ప్రకటించగా, బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి ఏడాదిపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు జరుపుతామని ప్రకటించారు.
ఈరోజు హైదరాబాద్‌లో సమైక్య దినోత్సవ వేడుకలు, మరోపక్క విమోచన దినోత్సవ వేడుకలు ఒకేసారి జరుగుతుండటం విశేషం. ఈ సందర్భంగా ఆనాడు తెలంగాణ విమోచన ఉద్యమం ఏవిదంగా సాగిందో, చివరికి ఏవిదంగా నిజాం సంస్థానం భారత్‌లో విలీనమయ్యిందో అందరూ తెలుసుకోవడం కూడా చాలా అవసరం. రాజ్ న్యూస్ టీవీ ఛానల్ క్లుప్తంగా అందించిన ఆ వివరాలు మీ కోసం...
(వీడియో: రాజ్ న్యూస్ సౌజన్యంతో)