నేటి నుంచి తెలంగాణా రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి. కనుక ఆయా జిల్లాలలో వివిధ శాఖలు యధావిదిగా తమ అధికారిక పనులు నిర్వర్తించుకోవడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రవాణాశాఖ కూడా కొత్త జిల్లాలలో వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం కొత్త కోడ్ నెంబర్లు కేటాయించింది. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా ఏర్పడినప్పుడు ఇదేవిధంగా జిల్లాలకి కొత్త కోడ్ నెంబర్లు కేటాయించవలసి వచ్చింది. పాత జిల్లాలకి ఇదివరకు ఉన్న సంఖ్యలనే కొనసాగించి కొత్త జిల్లాలకి మాత్రం కొత్త కోడ్ నెంబర్లు కేటాయించింది.
రంగారెడ్డి: 7, మేడ్చల్: 8, కామారెడ్డి: 17, నిర్మల్: 18, మంచిర్యాల: 19, అసిఫాబాద్: 20, జగిత్యాల: 21, పెద్దపల్లి: 22, సిరిసిల్ల: 23, వరంగల్ రూరల్: 24, భూపాల్పల్లి: 25, మహబూబాబాద్: 26, జనగాం: 27, భద్రాచలం: 28, సూర్యాపేట: 29, యాదాద్రి : 30, నాగర్ కర్నూల్ : 31, వనపర్తి : 32, జోగులాంబ (గద్వాల): 33, వికారాబాద్: 34, మెదక్: 35, సిద్దిపేట: 36.