దేశంలో మొట్టమొదటిసారిగా ఈ రోజు అతిపెద్ద అధికార వికేంద్రీకరణ జరుగుతోంది. ఆ ఘనత మన తెలంగాణా రాష్ట్రానికే దక్కడం విశేషం. రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్ళు పూర్తి కాకుండానే ఇంత బారీ మార్పులు చేసుకోవడం ఎవరూ ఊహించలేనిదే. ఈరోజు నుంచి రాష్ట్రంలో 31 జిల్లాలు, 68 రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలు ఏర్పడుతున్నాయి. కొత్త జిల్లాలు, కలెక్టర్లు, పోలీస్ తదితర వివిధ శాఖల అధికారుల నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత వరుసగా 30 జీవోలు జారీ చేసింది. ప్రభుత్వం ఒకేసారి అన్ని జీవోలు జారీ చేయడం కూడా సరికొత్త రికార్డేనని చెప్పవచ్చు.
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల వివరాలు:
రాష్ట్రంలో జిల్లాలు : అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమరం భీమ్ (ఆసిఫాబాద్), కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న (సిరిసిల్ల), నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ (భూపాలపల్లి), జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాది (కొత్తగూడెం), మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులంభ (గద్వాల), నల్గొండ, సూర్యాపేట, యదాద్రి, వికారాబాద్, మేడ్చల్ (మల్కాజ్ గిరి), రంగారెడ్డి, హైదరాబాద్.
కొత్త రెవెన్యూ డివిజన్లు:
ఆదిలాబాద్ జిల్లాలో: ఆదిలాబాద్ రూరల్, మావల, భీంపూర్, సిరికొండ, గాదిగూడ.
మంచిర్యాల జిల్లాలో : భీమారం, నస్పూర్, హాజీపూర్, కానేపల్లి
ఆసిఫాబాద్ (కొమురంభీం) జిల్లాలో : లింగాపూర్, పెంచికల్పేట, చింతలమానేపల్లి
నిర్మల్ జిల్లాలో : నిర్మల్ రూరల్, నిర్మల్ అర్బన్, సోన్, నర్సాపూర్ (జి), దస్తూరాబాద్, బాసర
కరీంనగర్ జిల్లాలో: కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, గన్నేరువరం, ఇల్లందకుంట, జగిత్యాల, జగిత్యాల రూరల్, బీర్పూర్, బుగ్గారం
పెద్దపల్లి జిల్లాలో: అంతర్గాం, పాలకుర్తి, రత్నాపూర్
సిరిసిల్ల జిల్లాలో: సిరిసిల్ల రూరల్, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగి
మహబూబ్నగర్ జిల్లాలో : మూసాపేట, మహబూబ్ నగర్ రూరల్, రాజాపూర్(బి), మరికల్, కృష్ణ
వనపర్తి జిల్లాలో : అమరచింత, మదనాపూర్, రేవల్లి, చిన్నంబావి, శ్రీరంగపూర్
నాగర్కర్నూల్ జిల్లాలో: పెంట్లవెల్లి, ఊర్కొండ, పదర, చారుకొండ
గద్వాల (జోగులాంబ) జిల్లాలో : కోటిదొడ్డి, రాజోలి, ఉండవల్లి
వరంగల్ అర్బన్ జిల్లాలో: ఖిలా వరంగల్, కాజీపేట, ఐనవోలు, వేలేరు
వరంగల్ రూరల్ జిల్లలో : దామెర
భూపాలపల్లి (జయశంకర్) జిల్లాలో : టేకుమట్ల, కన్నాయి గూడెం, పలిమెల
మహబూబాబాద్ జిల్లాలో : గంగారం, చిన్న గూడూరు, దంతాలపల్లి, పెద్ద వంగర
జనగాం జిల్లాలో : తరిగొప్పుల, చిల్పూరు
సిద్దిపేట జిల్లాలో : సిద్దిపేట రూరల్, మర్కూక్, రాయపోల్, కొమురవెల్లి, హుస్నాబాద్ రూరల్ (అక్కన్నపేట)
మెదక్ జిల్లలో : హవేలీ ఘన్ పూర్, నిజాంపేట, మనోహరాబాద్, చిల్పిచేడ్, నార్సింగి
సంగారెడ్డి జిల్లాలో : కంది, అమీన్పూర్, గుమ్మడిదల, వట్పల్లి, మొగుడంపల్లి, సిర్గాపూర్, నాగల్గిద్ద
నిజామాబాద్ జిల్లాలో : నిజామాబాద్ (నార్త్), నిజామాబాద్ రూరల్, ముగ్పల్, మెండోరా, రుద్రూరు, ఇందల్వాయి, ముక్కల్, ఎరగట్ల
కామారెడ్డి జిల్లాలో : రాజంపేట, బీవీపేట, రామారెడ్డి, పెద్ద కొడంగల్, నస్రుల్లాబాద్
నల్లగొండ జిల్లాలో : మాడ్గులపల్లి, తిర్మలగిరి సాగర్, కొండ మల్లేపల్లి, నేరేడుగొమ్ము, అడవి దేవులపల్లి
సూర్యాపేట జిల్లాలో : నాగారం, మద్దిరాల, పాలకీడు, అనంత గిరి, చింతలపాలెం (మల్లారెడ్డిగూడెం)
యాదాద్రి జిల్లాలో : అడ్డగూడూరు, మోటకొండూరు
ఖమ్మం జిల్లాలో: రఘునాథపాలెం
భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లాలో: సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, ఆల్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కర్కగూడెం
వికారాబాద్ జిల్లాలో : కోట్ పల్లి
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) జిల్లాలో : బాలాపూర్, కడ్తాల్, అబ్దుల్లాపూర్, గండిపేట, చౌదరిగూడెం, నందిగామ
మేడ్చల్ జిల్లాలో : అల్వాల్, దుండిగల్ గండి మైసమ్మ, బాచుపల్లి(నిజాంపేట), కూకట్పల్లి, కాప్రా